Petrol Price: ఆగని పెట్రో మోత.. మరోసారి పెరిగిన ధరలు
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా రోజూ ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి
దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా రోజూ ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వాహనదారులపై మరింత భారం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. గురువారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై లీటర్ కు 80 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.40కి చేరుకోగా.. డీజిల్ ధర రూ.101.56కి చేరుకుంది. ఇక గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.117గా ఉండగా.. డీజిల్ రూ.103.10గా ఉంది.