ఈ ఏడాది పండుగ సీజన్‌లో 10 లక్షల కార్లు అమ్మకాలు!

దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఈ ఏడాది పండుగ సీజన్‌లో 10 లక్షల మార్కును దాట వచ్చని మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఉద్యోగి తెలిపారు.

Update: 2023-08-13 11:35 GMT

చెన్నై: దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఈ ఏడాది పండుగ సీజన్‌లో 10 లక్షల మార్కును దాట వచ్చని మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఉద్యోగి తెలిపారు. ప్రధానంగా యుటిలిటీ వాహనాలకు డిమాండ్ అత్యధికంగా ఉండటంతో అమ్మకాలు ఊపందుకుంటాయన్నారు. ఈ ఏడాది ఆగష్టు 17 నుంచి నవంబర్ 14 మధ్య 68 రోజుల వరకు పండుగ సీజన్ ఉండనుంది. అయితే, ఈ మధ్యకాలంలో కొన్నిరోజులు కొనుగోళ్లు ఉండవు. సాధారణంగా పండుగ సీజన్ అమ్మకాలు ఏడాది మొత్తం అమ్మకాల్లో 22-26 శాతం వాటాను కలిగి ఉంటాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం ప్యాసింజర్ వాహన అమ్మకాలు 40 లక్షలు దాటవచ్చని, పండుగ సీజన్ మాత్రమే 10 లక్షల యూనిట్ల మార్కు ఉంటుందని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. ఈ ఏడాది వాహనాల అమ్మకాలు బాగున్నాయి. జూలైలో సుమారు 3.52 లక్షల యూనిట్లతో రెడో అత్యధిక అమ్మకాలు జరిగాయి. రానున్న నెలల్లో ఇది మరింత వృద్ధి సాధించవచ్చు. అయితే, చాలావరకు కార్లను లోన్ ద్వారానే కొంటారు, కాబట్టి అధిక వడ్డీ రేట్ల వల్ల అమ్మకాలపై ప్రభావం ఉండోచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పండుగ సీజన్ అమ్మకాలపై విశ్వాసం కలిగి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.


Similar News