Amazon: ఉద్యోగులు ఆఫీస్​కు రావాల్సిందే.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ముగింపు పలికిన అమెజాన్

కరోనా వైరస్ క్రమక్రమంగా అంతరించిన తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) విధానానికి ముగింపు పలుకుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-18 12:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ క్రమక్రమంగా అంతరించిన తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) విధానానికి ముగింపు పలుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్(Amazon) కూడా వచ్చే ఏడాది నుంచి ఉద్యోగులు(Employees) పూర్తిగా ఆఫీస్ నుంచే పని చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి జనవరి 2వ తేదీ వరకు గడువు విధించింది. ఈ మేరకు అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈఓ మాట్ గార్మన్(AWS CEO Matt Garman) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై ఉద్యోగులు వారానికి మూడు రోజులు కాకుండా ఐదు రోజులు ఆఫీస్​కు వచ్చి పని చేయాలని, వర్క్ ఫ్రమ్ ఆఫీస్(Work From Office) ఇష్టం లేని వారు జాబ్ మానేసుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ కొత్త విధానాన్ని10 మంది ఉద్యోగుల్లో 9 మంది స్వాగతించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకునే వారు అమెజాన్ లో జాబ్ మానేసి వేరే కంపెనీలో వెతుక్కోవాలని గార్మన్ హెచ్చరించారు. కొత్త విధానాల అమలకు కృషి చేస్తున్నాం. రిమోట్ వర్క్ కారణంగా నూతన ఆవిష్కరణల(New Innovations) తీసుకురావడంలో సహకారం కష్టంగా మారుతోంది. వారంలో మూడు రోజులు ఆఫీస్ కు వచ్చి పని చేస్తే కంపెనీ లక్ష్యాలను చేరుకోవడం చాలా కష్టమని ఆయన తెలిపారు. కాగా అమెజాన్ సీఈఓ(Amazon CEO)గా ఆండీ జెస్సీ(Andy Jassy) బాధ్యతలు స్వీకరించిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలకాలని ఆయన నిర్ణయించారు. ఉద్యోగులు వారంలో మూడు రోజులు అమెజాన్ కార్యాలయానికి వచ్చి పని చేయాలని ఆయన గతంలో ఆదేశించారు. దీంతో అప్పటినుంచి అమెజాన్ వారానికి మూడు రోజులు ఆఫీస్​కు రావాలనే విధానాన్ని అమలు చేస్తోంది.  


Similar News