రూ.100 కోట్ల ఆదాయాన్ని సాధించిన OYO

2023-24 ఆర్థిక సంవత్సరంలో OYO నికర ఆదాయం రూ.100 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ గురువారం ప్రకటించారు.

Update: 2024-05-30 08:33 GMT

దిశ, బిజినెస్ బ్యూరో:2023-24 ఆర్థిక సంవత్సరంలో OYO నికర ఆదాయం రూ.100 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ గురువారం ప్రకటించారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి, హోటల్ భాగస్వామి ముఖంలో చిరునవ్వు తెప్పించడానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాం. మా తొలి నికర లాభదాయక ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 100 కోట్లను కలిగి ఉన్నాము, ఇది వరుసగా ఎనిమిది త్రైమాసికాల సానుకూల EBITDA. దీంతో దాదాపు రూ. 1,000 కోట్ల నగదు నిల్వను కలిగి ఉన్నామని రితేష్ అగర్వాల్ చెప్పారు. అలాగే, ఒక్క భారత్‌లోనే కాకుండా నార్డిక్స్, సౌత్ ఈస్ట్ ఆసియా, అమెరికా,UK వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా OYO వృద్ధి అవకాశాలపై విశ్వాసం ఉందని ఆయన అన్నారు.

ఫిచ్ రేటింగ్స్ గురించి ప్రస్తావించిన రితేష్ OYO మెరుగైన పనితీరు, బలమైన నగదు ప్రవాహాలను గుర్తించిన గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ సంస్థ ఫిచ్ OYO క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసిందని ఆయన హైలైట్ చేశారు. దీంతో ప్రీమియమైజేషన్, ఆధ్యాత్మిక ప్రయాణం, వ్యాపార ప్రయాణం, సమావేశాలు, డెస్టినేషన్ వెడ్డింగ్‌లు వంటి అభివృద్ధి చెందుతున్న ప్రయాణ ధోరణులతో భారతదేశంలోనే కాకుండా ఇతర కీలక మార్కెట్లలో కూడా వృద్ధిని చూస్తామని తెలిపారు. ఫిచ్ రేటింగ్స్ ఇటీవల OYO మాతృ సంస్థ, Oravel Stays రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో OYO ప్రపంచవ్యాప్తంగా 5,000 హోటళ్లు, 6,000 గృహాలను జతచేయడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 99.6 కోట్ల PAT(పన్ను తర్వాత లాభం), రూ. 888 కోట్ల సర్దుబాటు చేసిన EBITDAని నివేదించింది.


Similar News