Hyundai Motors: హ్యుండాయ్ మోటార్స్ దీపావళి ఆఫర్లు.. ఈ కార్లపై భారీ డిస్కౌంట్స్..!

మన దేశంలో ప్రస్తుతం దీపావళి పండగా(Diwali Festival) సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే.

Update: 2024-10-28 17:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: మన దేశంలో ప్రస్తుతం దీపావళి పండగా(Diwali Festival) సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఫెస్టివల్ సీజన్(Festival Season)లో ప్రతి ఒక్కరు ఎదో ఒక వస్తువును కొనాలని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. దీంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు కంపెనీలు భారీ స్థాయిలో ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా(South Korea)కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మోటార్స్(Hyundai Motors) అనుబంధ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా(Hyundai Motor India) కూడా 'సూపర్ డిలైట్ డేస్(Super Delight Days)' పేరుతో కార్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా తన కంపాక్ట్ ఎస్‌యూవీ కారు(SUV car) హ్యుండాయ్ వెన్యూ(Hyundai Venue)పై భారీగా ఆఫర్ ప్రకటించింది. ఈ కారును కొనుగోలు చేస్తే కస్టమర్లు రూ.80 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధర రూ. 7.94 లక్షల నుండి రూ.13.53 లక్షల వరకు ఉంది.

అలాగే హ్యుండాయ్ ఎక్స్‌టర్(Hyundai Exter), హ్యుండాయ్ ఐ20(Hyundai i20) కార్లపైనా కూడా సంస్థ ఆఫర్లు అందిస్తోంది. భారత మార్కెట్లో ప్రస్తుతం హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర వేరియంట్(Variant)ను బట్టి రూ .6.13 లక్షల నుండి రూ .10.43 లక్షల వరకు ఉంది. అయితే ఈ కారును కొనుగోలు చేస్తే రూ .42,972 వరకు వినియోగదారులు ఆదా చేయవచ్చు. ఇక ఐ20(i20) కారుపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ సమయంలో హ్యుందాయ్ ఐ20 కొనుగోలుపై కస్టమర్లు రూ .55,000 వరకు సేవ్ చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు ధర రూ .7 లక్షల నుండి రూ .11.20 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.

Tags:    

Similar News