రియల్‌మీ ఇండియాలో డజనుకు పైగా సీనియర్ ఉద్యోగుల రాజీనామా!

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ ఇండియాలో పెద్ద ఎత్తున సీనియర్ ఉద్యోగులు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

Update: 2023-07-26 10:05 GMT

న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ ఇండియాలో పెద్ద ఎత్తున సీనియర్ ఉద్యోగులు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో కలిపి డజనుకు పైగా ఉద్యోగులు కంపెనీని వీడినట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. కంపెనీని వీడిన ఉద్యోగులందరూ గతంలో రియల్‌మీ సీఈఓ మాధవ్ సేథ్‌కు చెందిన హానర్ టెక్ కంపెనీలో చేరేందుకే రాజీనామా చేశారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

కొందరు డైరెక్టర్లు కూడా హానర్‌టెక్‌లో చేరడానికి సాముహిక రాజీనామా చేయడం గమనార్హం. ఇటీవలే రియల్‌మీ మాజీ సేల్స్ డైరెక్టర్ దీపేష్ పునమియా హానర్‌టెక్‌లో అసిస్టెంట్ వైస్-ప్రెసిడెంట్‌గా చేరిన సీనియర్ అధికారుల్లో ఉన్నారు. ఈ వ్యవహారంపై రియల్‌మీ సంస్థ అధికారికంగా స్పందించలేదు.

కాగా, గత నెలలో ఎగుమతులకు సంబంధించిన కొత్త వెంచర్‌ను ప్రారంభించేందుకు రియల్‌మీ సహ-వ్యవస్థాపకుడు మాధవ్ సేథ్ ఐదేళ్ల నుంచి ఉన్న బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News