Ola Electric: చిన్న నగరాల్లో 10,000 ఔట్‌లెట్లు ప్రారంభించనున్న ఓలా ఎలక్ట్రిక్

నెట్‌వర్క్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగంగా చిన్న నగరాల్లో ఈవీ అమ్మకాలను పెంచేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది

Update: 2024-09-26 14:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈవీ తయారీ మేకర్ ఓలా ఎలక్ట్రిక్ వచ్చే ఏడాది చివరి నాటికి భారీ సంఖ్యలో కొత్త ఔట్‌లెట్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ముఖ్యంగా చిన్న నగరాలు, పట్టణాల్లో కంపెనీ విస్తరణలో భాగంగా 2025 ఆఖరు నాటికి 10,000 సర్వీస్, సేల్స్ ఔట్‌లెట్లను ప్రారంభించనున్నట్టు గురువారం ప్రకటనలో తెలిపింది. నెట్‌వర్క్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగంగా చిన్న నగరాల్లో ఈవీ అమ్మకాలను పెంచేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విక్రయాలను పెంచేందుకు కంపెనీ ఇప్పటికే 625 మంది పార్ట్‌నర్‌లను తీసుకుందని, ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్‌కు ముందు వెయ్యి మందిని చేర్చుకునే ప్రణాళిక కలిగి ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ 800 స్టోర్లను కొనసాగిస్తోంది. ఈసారి పండుగ సీజన్ కోసం దాదాపు 1,800 సేల్స్ అండ్ సర్వీస్ టచ్ పాయింట్లను ప్రారంభించనుంది. 

Tags:    

Similar News