Musk-Modi: ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన నేతగా మోడీ.. అభినందనలు తెలిపిన మస్క్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత ప్రధాని మోడీకి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
దిశ, బిజినెస్ బ్యూరో: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత ప్రధాని మోడీకి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. సోషల్‌మీడియా ఎక్స్(గతంలో ట్విట్టర్)లో అత్యధికంగా మంది ఫాలోవర్స్‌ను కలిగిన ప్రపంచనాయకుడిగా నిలిచినందుకు మోడీకి కంగ్రాట్స్ తెలిపారు. ఈ వారం ప్రారంభంలో మోడీ ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లను అధిగమించి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా మంది ఫాలోవర్స్‌ను కలిగిన వ్యక్తిగా అవతరించారు. మోడీ ఎక్స్ ఖాతాలో భారత్‌లో ఉన్న ఇతర నాయకులనే కాకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రస్తుత దుబాయ్ పాలకుడు, పోప్ ఫ్రాన్సిస్‌లతో సహా అత్యంత శక్తివంతమైన ప్రపంచ నాయకులను అధిగమించి అత్యధిక మంది అనుసరించే వ్యక్తిగా నిలిచారు.
మోడీ 100 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉండగా, జో బైడెన్ ఖాతాకు 38.1 మిలియన్ల మంది, ట్రంప్‌కు 87.7 మిలియన్లు, పోప్ ఫ్రాన్సిస్ 18.5 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నారు. అదే భారత నాయకుల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 26.4 మిలియన్ ఫాలోవర్లు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 27.5 మిలియన్లు, సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్‌కు 19.9 మిలియన్లు, విరాట్ కోహ్లీ 64.1 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.