అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముంబై అగ్రస్థానం!

దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై మొదటిస్థానంలో నిలిచింది.

Update: 2023-06-07 16:26 GMT

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై మొదటిస్థానంలో నిలిచింది. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ మెర్సర్స్ రూపొందించిన కాస్ట్ ఆఫ్ లివింగ్-2023 నివేదిక ప్రకారం, ముంబై తర్వాత న్యూఢిల్లీ, బెంగళూరు నగరాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఐదు ఖండాల్లోని 227 నగరాలతో రూపొందించిన ఈ నివేదికలో ప్రవాసుల కోసం భారత్‌లోని అత్యంత ఖరీదైన నగరం ముంబై ఉండగా, గ్లోబల్ ర్యాంకుల్లో హాంకాంగ్ అగ్రస్థానంలో ఉంది.

ప్రపంచ ర్యాంకింగ్‌లో ముంబై 147వ స్థానంలో నిల్వగా, న్యూఢిల్లీ(169), చెన్నై(184), బెంగళూరు(189), హైదరాబాద్(202), కోల్‌కతా(211), పూణె(213) స్థానాల్లో ఉన్నాయి. మెర్సర్స్ నివాస, రవాణ, ఆహార, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం సహా ప్రతి దేశంలోని 200 కంటే ఎక్కువ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా హాంకాంగ్ తర్వాత సింగపూర్, జ్యూరిచ్ నగరాలు ఖరీదైనవిగా నిలిచాయి. నివాసానికి చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పూణె నగరాలు ముంబై కంటే 50 శాతం తక్కువ ఖర్చును కలిగి ఉంటాయని నివేదిక తెలిపింది.

Tags:    

Similar News