Mukesh Ambani is Back .. ఆసియా అత్యంత సంపన్నుడు అతనే!

ఈ ఏడాది ప్రారంభంలో హిండెన్‌బర్గ్ దెబ్బకు గౌతమ్ అదానీ భారీగా సంపదను కోల్పోవడంతో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని సంపాదించుకున్నారని ఫోర్బ్స్ వెల్లడించింది

Update: 2023-04-04 15:27 GMT

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రారంభంలో హిండెన్‌బర్గ్ దెబ్బకు గౌతమ్ అదానీ భారీగా సంపదను కోల్పోవడంతో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని సంపాదించుకున్నారని ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం బిలియనీర్-2023 జాబితా విడుదల సందర్భంగా ఫోర్బ్స్ తెలిపింది. ఈ ఏడాది జనవరి 24న దాదాపు 126 బిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా ఎదిగిన గౌతమ్ అదానీ ఆ తర్వాత హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా భారీ సంపను కోల్పోయరు.

ప్రస్తుతం అదానీ నికర విలువ 47.2 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 3.87 లక్షల కోట్లు)తో భారత రెండో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. రూ. 6.85 లక్షల కోట్లతో అంబానీ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. గతేడాది రిలయన్స్ సంస్థ 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించిందని ఫోర్బ్స్ పేర్కొంది.

ఇక, ఫోర్బ్స్ 2023 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారతీయులు రికార్డు స్థాయిలో 169 మంది ఉన్నారు. గతేడాది కంటే ముగ్గురు పెరిగారు. వారందరి సంపద విలువ 10 శాతం తగ్గి రూ. 55.42 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ మూడో అత్యంత సంపన్నుడిగా శివ్ నాడార్ రూ. 2.10 లక్షల కోట్లు(2022 కంటే 11 శాతం క్షీణత), సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్ పూనావాలా రూ. 1.86 లక్షల కోట్ల(7 శాతం క్షీణత)తో నాలుగో స్థానంలో ఉన్నారు. లక్ష్మీ మిట్టల్ 5వ స్థానంలో నిలిచారు.

ఆ తర్వాత సావిత్రి జిందాల్, దిలీప్ సంఘ్వి, రాధాకిషన్ దమానీ, కుమార్ మంగళం బిర్లా, ఉదయ్ కోటక్ టాప్ 10 జాబితాలో ఉన్నారు. అత్యంత పిన్న వయసు బిలియనీర్‌గా జిరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్(36 ఏళ్లు) ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

అంబానీ కోడలి చీర ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!  

Tags:    

Similar News