NPS Vatsalya: ఎన్‌పీఎస్ వాత్సల్య పథకంలో మొదటి రోజే 9,705 మంది మైనర్ సబ్‌స్క్రైబర్ల నమోదు

ఈ పథకం దేశంలో అభివృద్ధి చెందుతున్న పెన్షన్ విభాగంలో ముఖ్యమైన మైలురాయిని అని ఆర్థిక మంత్రి తెలిపారు.

Update: 2024-09-20 19:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలానికి పెట్టుబడి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకాన్ని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభమైన రోజునే దాదాపు 9,700 మంది మైనర్ సబ్‌స్క్రైబర్లు ఎన్‌పీఎస్ వాత్సల్య కింద నమోదు చేసుకున్నారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) ద్వారా నియంత్రించబడే, నిర్వహించబడే ఈ పథకం, తల్లిదండ్రులు వారి పిల్లల పదవీ విరమణ కోసం ముందుగానే పొదుపు చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఈ పథకం దేశంలో అభివృద్ధి చెందుతున్న పెన్షన్ విభాగంలో ముఖ్యమైన మైలురాయిని అని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకం మొదటిరోజే అద్భుతమైన స్పందన వచ్చింది. మొత్తం 9,705 మంది మైనర్ సబ్‌స్క్రైబర్లు ఈ పథకంలో చేరారని పీఎఫ్ఆర్‌డీఏ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. వాటిలో ఈ-ఎన్‌పీఎస్ పోర్టల్ ద్వారానే 2,197 అకౌంట్లు ప్రారంభించారని పేర్కొంది. 

Tags:    

Similar News