Meta: తూచ్.. మేం సీసీఐ నిర్ణయాన్ని అంగీకరించం.. మెటా కీలక ప్రకటన

వాట్సప్‌ (WhatsApp) గోప్యతా విధానానికి సంబంధించి మెటా (Meta) మంగళవారం కీలక ప్రకటన చేసింది. ది కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) నిర్ణయాన్ని అంగీకరించలేమంది.

Update: 2024-11-19 07:41 GMT

దిశ, బిజినెస్: వాట్సప్‌ (WhatsApp) గోప్యతా విధానానికి సంబంధించి మెటా (Meta) మంగళవారం కీలక ప్రకటన చేసింది. ది కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) నిర్ణయాన్ని అంగీకరించలేమంది. సీసీఐ విధించిన రూ.213 కోట్ల జరిమానా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దీనిపై అప్పీల్‌కు వెళ్లే ఆలోచన చేస్తున్నామంది. 2021లో తీసుకొచ్చిన అప్‌డేట్‌ గురించి మెటా స్పందించింది. ‘‘మేము సీసీఐ నిర్ణయంతో విభేదిస్తున్నాం. అప్పీల్‌కు వెళ్లే ఆలోచన చేస్తున్నాం. 2021లో తీసుకొచ్చిన అప్‌డేట్‌ తో వ్యక్తుల గోప్యతకు ఎలాంటి భంగం జరగలేదు. దీని వల్ల ఎవరూ వారి అకౌంట్స్ కోల్పోవడం లేదా డిలీట్‌ కావడం వంటి సంఘటనలు జరగలేదు’’ అని మెటా ప్రకటనలో చెప్పుకొచ్చింది.

కేసు ఏంటంటే?

ప్రైవసీ విధానానికి సంబంధించి 2021 ఫిబ్రవరి 8న తీసుకొచ్చిన అప్‌డేట్‌లో అనైతిక వ్యాపార విధానాలు అవలంభించినందుకు వాట్సప్‌ మాతృసంస్థ మెటాకు సీసీఐ రూ.213 కోట్ల జరిమానా విధించింది. 2016 ఆగస్టు 25 నాటి విధానం ప్రకారం, ఈ విషయంలో యూజర్స్ దే తుది నిర్ణయమంది. తమ వివరాలను మెటాతో పంచుకోవాలా, వద్దా.. నిర్ణయించుకునే హక్కును వినియోగదారులకు ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా ఇవ్వాలని సీసీఐ స్పష్టంచేసింది. వాట్సప్‌లో సేకరించిన డేటాను మెటా కంపెనీలతో లేదా మెటా కంపెనీల ఉత్పత్తులతో ప్రకటనల కోసం అయిదేళ్ల పాటు పంచుకోకుండా చూడాలని ఆదేశించింది. సీసీఐ ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. దీనిపైనే మెటా ఈ ప్రకటన చేసింది.

Tags:    

Similar News