Benz cars: మెర్సిడెస్ బెంజ్ నుంచి అదిరిపోయే రెండు కొత్త కార్లు

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో అదిరిపోయే రెండు కొత్త మోడల్ కార్లను విడుదల చేసింది.

Update: 2024-08-08 14:55 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో అదిరిపోయే రెండు కొత్త మోడల్ కార్లను విడుదల చేసింది. ఒకదాని పేరు ‘ CLE క్యాబ్రియోలెట్‌’. ధర రూ.1.10 కోట్లు(ఎక్స్-షోరూమ్). మరొకటి ‘AMG GLC 43 కూపే’. దీని ధర రూ.1.10 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ రెండు కూడా అధునాతన ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఇవి జులై నెలలో మిగతా దేశాల్లో లాంచ్ కాగా, ఇప్పుడు భారత్‌లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

Mercedes-Benz CLE 300 క్యాబ్రియోలెట్ మోడల్, C-క్లాస్ ఆధారంగా రూపొందించబడింది. ఇది 2.0 లీటర్ నాలుగు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో 258hp పవర్, 400Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. దీనిలో 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ గేర్‌ బాక్స్ ఉంది. ఈ కారు 6.6 సెకన్లలో 0-100kph నుండి 250kph వేగంతో దూసుకుపోగలదని కంపెనీ పేర్కొంది. కారు లోపల మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 11.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌‌ను అందించారు. అలాగే MBUX సాఫ్ట్‌వేర్, క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్, పవర్డ్ AMG సీట్లు ఉన్నాయి. ఒక బటన్‌ను నొక్కడం ద్వారా టాప్ మొత్తం ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం ఈ మోడల్‌ను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా బుకింగ్ చేయవచ్చు.


Mercedes-AMG GLC 43 4MATIC కూపే, ఇది టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. 421 hp గరిష్ట పవర్, 500 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. ఇది కేవలం 4.7 సెకన్లలో 0 నుండి 100kph వేగాన్ని అందుకుంటుంది. కారు లోపల 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 11.9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉన్నాయి. AMG బ్రేక్‌లు, స్టీరింగ్ వీల్స్, డైనమిక్ ఇంజన్ మౌంట్‌లు వంటి ఫీచర్లను కలిగి ఉంది. రెండు మోడల్స్‌లో కూడా భద్రత కోసం ఎయిర్‌బాగ్స్ ఇంకా పలు అధునాతన ఫీచర్లను అందించారు.




Tags:    

Similar News