అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ బాటలోనే మరో సంస్థ!
అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ తర్వాత ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ మెక్ డొనాల్డ్స్ కంపెనీ కూడా ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది.
దిశ, వెబ్‌డెస్క్: అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ తర్వాత ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ మెక్ డొనాల్డ్స్ కంపెనీ కూడా ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. మెక్ డొనాల్డ్స్ ఈ ఏడాది ఏప్రిల్‌లో సిబ్బంది తగ్గింపులను ప్రకటించింది. సంస్థలోని ఉద్యోగులను తొలగించేందుకు మెక్‌డొనాల్డ్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మెక్‌డొనాల్డ్ సీఈవో వాల్ స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడుతూ.. కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లో కొంత భాగాన్ని తగ్గించాలని ఉద్యోగుల కోతలు చేస్తున్నట్లు క్రిస్ కెంప్జిన్స్కీ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో కంపెనీ ఖర్చులను తగ్గిస్తుందని, వృద్ధి సాధించడంలో పెట్టుబడి తగ్గించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇక, ప్రస్తుత లెక్కల ప్రకారం.. కంపెనీలో దాదాపు 2,00,000 మంది కార్పొరేట్ సిబ్బంది, కార్మికులు ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి : రూ. 75 డివిడెండ్ ప్రకటించిన TCS