పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ కు ఫుల్ డిమాండ్ ఉంది.
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ కు ఫుల్ డిమాండ్ ఉంది. ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా, ఇతర వేడుకలకు తెలుగు ప్రజలు ఎక్కువగా బంగారు అభరణాల్ని అలంకరించుకుంటారు. అయితే తరచూ బంగారం, వెండి ధరల్లో మార్పుల జరుగుతూనే ఉంటాయి. కానీ నేడు ఒక్కసారిగా 1000 రూపాయలకు పైగా పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 60, 800 లు ఉండగా.. నేడు 61, 800 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం చేసినట్లైతే.. నిన్న 66, 330 గా ఉండగా... నేడు 67, 420 గా ఉంది. కాగా బంగారం కొనలానుకునేవారు ఇప్పట్లో పెద్ద ఊరట కనినిపించే పరిస్థితి కనిపించట్లేదు. తగ్గినట్లే తగ్గి.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఊహించని రీతిలో 1000, 2000 వరకు పెరుగుతుండటం గమనార్హం.
హైదరాబాదులో నేటి బంగారం ధరలు..
22 క్యారెట్ల బంగారం ధర: రూ. 61,800
24 క్యారెట్ల బంగారం ధర: రూ.67, 420
విజయవాడలో నేటి బంగారం ధరలు..
22 క్యారెట్ల బంగారం ధర: రూ. 61,800
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 67, 420