ట్రంప్ విజయం.. అమాంతం పెరిగిన ప్రపంచ కుబేరుడి సంపద.. ఎంతో తెలిస్తే షాకవ్వడం ఖాయం
ట్రంప్ విజయంతో మస్క్ సంపద అమాంతం పెరిగింది. ఇప్పటికే ప్రపంచ అపర కుబేరుల లిస్టులో టాప్ లో ఉన్న ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సంపద.. ఇప్పుడు రెండు లక్షల కోట్ల మేర పెరిగింది.
దిశ, వెబ్ డెస్క్: డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (America President Elections) విజయం సాధించి.. రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ట్రంప్ విజయం వెనుక మస్క్ (Elon Musk) ఉన్నాడన్న విషయం జగమెరిగిన సత్యం. ట్రంప్ విజయంతో ఆయన సంపద అమాంతం పెరిగింది. ఇప్పటికే ప్రపంచ అపర కుబేరుల లిస్టులో టాప్ లో ఉన్న ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సంపద.. ఇప్పుడు రెండు లక్షల కోట్ల మేర పెరిగింది. అంటే 26.5 బిలియన్ డాలర్ల లాభం చేకూరింది. ప్రస్తుతం మస్క్ నికర సంపద 290 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదించింది. అమెరికా ఎన్నికల ఫలితాలు మస్క్ షేర్ల విలువను పెంచడంతో.. ఆయన సంపద పెరిగింది.
ఆయనతో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) సంపద కూడా పెరిగింది. 7.14 బిలియన్ డాలర్లు అంటే రూ.60 వేల కోట్లు పెరిగింది. ప్రస్తుతం ఆయన సంపద 228 బిలియన్ డాలర్లకు చేరింది. ఒరాకిల్ (Oracle) కో ఫౌండర్, సీటీఓ.. లారీ ఎలిసన్, ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ల సంపద సైతం పెరిగింది.