మలేషియా ఎయిర్‌లైన్స్, ఇండిగో మధ్య కీలక ఒప్పందం

భారత్, మలేషియా దేశాల మధ్య నేరుగా విమాన కనెక్టివిటీని పెంపొందించడానికి దేశీయ విమానయాన సంస్థ ఇండిగో, మలేషియా ఎయిర్‌లైన్స్ మధ్య ఒక కోడ్‌షేర్ భాగస్వామ్యం ఒప్పందం కుదిరింది.

Update: 2024-04-03 08:35 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, మలేషియా దేశాల మధ్య నేరుగా విమాన కనెక్టివిటీని పెంపొందించడానికి దేశీయ విమానయాన సంస్థ ఇండిగో, మలేషియా ఎయిర్‌లైన్స్ మధ్య ఒక కోడ్‌షేర్ భాగస్వామ్యం ఒప్పందం కుదిరింది. దీంతో రెండు దేశాల మధ్య ప్రయాణించడానికి కస్టమర్లకు ఎలాంటి అతుకులు లేకుండా సులభమైన ప్రయాణం, మరిన్ని ఎంపికలు లభిస్తాయి. ఇండిగో కస్టమర్లు మలేషియా ఎయిర్‌లైన్స్ విస్తృత నెట్‌వర్క్ ద్వారా మరిన్ని ఆగ్నేయాసియా గమ్యస్థానాలను చేరుకోగలుగుతారని, అంతేకాకుండా వారు ఇంటిగ్రేటెడ్ ట్రావెల్ ఇటినెరరీని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుందని ఇండిగో తెలిపింది.

మలేషియా ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం న్యూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్, అమృత్‌సర్,యు త్రివేండ్రంతో సహా భారత్‌లోని తొమ్మిది కీలక కేంద్రాలకు 71 వారపు విమానాలను నడుపుతోంది. మలేషియా ఏవియేషన్ గ్రూప్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఇజం ఇస్మాయిల్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, భారతదేశం మా అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌గా ఉన్నందున, మేము ప్రస్తుతం భారత్‌లో నిర్వహిస్తున్న తొమ్మిది హబ్‌లకు మించి మా పరిధిని మరింత విస్తృతం చేయడానికి ఇండిగోతో ఈ అవగాహన ఒప్పందాన్ని చేసుకోవడం మాకు సంతోషంగా ఉందని అన్నారు.


Similar News