Maha Kumbh: 500 శాతం వరకు పెరిగిన కుంభమేళా వెళ్లే విమాన టికెట్ ధరలు

ప్రయాగ్‌రాజ్‌కు విమానాల బుకింగ్‌లు, విమాన ఛార్జీలు అనేక రెట్లు పెరిగాయి.

Update: 2025-01-15 16:30 GMT
Maha Kumbh: 500 శాతం వరకు పెరిగిన కుంభమేళా వెళ్లే విమాన టికెట్ ధరలు
  • whatsapp icon

దిశ, బిజినెస్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళ కారణంగా ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణించే విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ మధ్య విమాన టిక్కెట్ ధరలు 21 శాతం వరకు పెరిగాయి. మహా కుంభమేళా కోసం ఎక్కువ మంది ప్రజలు ప్రయాణించడంతో ప్రయాగ్‌రాజ్‌కు విమానాల బుకింగ్‌లు, విమాన ఛార్జీలు అనేక రెట్లు పెరిగాయి. ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో ప్రకారం.. భోపాల్, ప్రయాగ్‌రాజ్ మధ్య వన్-వే విమాన ఛార్జీలు గతేడాది రూ. 2,977 ఉండగా, ఇప్పుడు 498 శాతం పెరిగి రూ. 17,796కి చేరుకుంది. ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ మధ్య తిరిగే విమానాల టికెట్ ధరలు 21 శాతం అధికంగా రూ. 5,748 ఉంది. ముంబై-ప్రయాగ్‌రాజ్ మధ్య ధరలు 13 శాతం పెరిగి రూ. 6,381కు చేరింది. బెంగుళూరు-ప్రయాగ్‌రాజ్ సర్వీసుల విమాన టిక్కెట్ ధర 89 శాతం పెరిగి రూ. 11,158కి చేరుకోగా, అహ్మదాబాద్-ప్రయాగ్‌రాజ్ విమానాల టికెట్ల ధరలు 41 శాతం ఎక్కువగా రూ.10,364 ఉందని ఇక్సిగో వెల్లడించింది. ఇవి కాకుండా ప్రయాగ్‌రాజ్‌కు సమీపంలో ఉన్న వారణాసి, లక్నో నగరాల నుంచి టికెట్ ధరలు కూడా 21 శాతం వరకు పెరిగాయి. సగటున విమాన సర్వీసుల బుకింగ్స్‌లో 162 శాతం పెరిగింది. వారణాసి టికెట్ల డిమాండ్ 127 శాతం, లక్నో టికెట్లకు 42 శాతం డిమాండ్ పెరిగింది. పరిశ్రమల వర్గాల ప్రకారం.. భోపాల్-ప్రయాగ్‌రాజ్ మార్గంలో తక్కువ సర్వీసులు, అధిక డిమాండ్ వల్ల ధర రూ. 17,000కు పైగా ఉన్నాయని ఇక్సిగో పేర్కొంది. 

Tags:    

Similar News