Nirmala Sitharaman: రెండో త్రైమాసికంలో వృద్ధి బలహీనత తాత్కాలికమే: నిర్మలా సీతారామన్

గత మూడేళ్లలో జీడీపీ వృద్ధి రేటు సగటున 8.3 శాతంగా ఉంది.

Update: 2024-12-17 14:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతంతో నెమ్మదించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంచనాల కంటే తక్కువ జీడీపీ నమోదవడం తాత్కాలిక ప్రతికూలత అని, రానున్న త్రైమాసికాల్లో ఆర్థికవ్యవస్థ మెరుగైన వృద్ధిని సాధిస్తుందని అన్నారు. లోక్‌సభలో గ్రాంట్ల డిమాండ్లపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆర్థిక మంత్రి.. భారత ఆర్థికవ్యవస్థ గత కొన్నేళ్ల నుంచి స్థిరమైన, బలమైన వృద్ధిని సాధిస్తోంది. గత మూడేళ్లలో జీడీపీ వృద్ధి రేటు సగటున 8.3 శాతంగా ఉంది. దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతోందని సీతారామన్‌ తెలిపారు. రెండవ త్రైమాసికంలో నమోదైన బలహీన వృద్ధి కేవలం 'తాత్కాలిక అడ్డంకి ' మాత్రమేనని, రాబోయే త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధిని చూస్తుందన్నారు. సమీక్షించిన త్రైమాసికంలో తయారీ రంగం బలహీనంగా ఉంది. అందువల్లే వృద్ధిపై ప్రతికూల ప్రభావం కనిపించిందన్నారు. ద్రవ్యోల్బణం గురించి సీతారామన్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణాన్ని మెరుగ్గా నియంత్రింది. గత యూపీఏ హయాంలో ఇది రెండంకెల స్థాయిలో ఉండేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News