Lot Mobiles: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్..లాట్ మొబైల్స్ లో దసరా, దీపావళి బంపర్ ఆఫర్స్
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దసరా,దీపావళి పండగల సందడి నెలకొంది.
దిశ, వెబ్‌డెస్క్:తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దసరా,దీపావళి పండగల సందడి నెలకొంది. ఈ మేరకు కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇదిలా ఉంటే..ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ లాట్ మొబైల్స్(Lot Mobiles) ఈ ఏడాది 12వ వార్షికోత్సవం(12th Anniversary) జరుపుకుంటోంది. అలాగే దసరా,దీపావళి పండగల సందర్భంగా ‘సెలబ్రేట్ విత్ లాట్(Celebrate With Lot)’ పేరుతో ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. మునుపెన్నడు లేని విధంగా స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేసే వారికి బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ విషయాన్నిలాట్ మొబైల్స్ డైరెక్టర్ ఎం.అఖిల్(M. Akhil) వెల్లడించారు.
ఈ ఆఫర్లలో భాగంగా రూ.9,999 వరకు విలువ చేసే ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతులు(Gifts) ఇస్తామని తెలిపారు. ఇక స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్లు,ల్యాప్‌టాప్ ఏసీలపై 40 శాతం డిస్కౌంట్ సహా 10 శాతం క్యాష్ బ్యాక్(Cash Back)ను ఆఫర్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.అలాగే ఎలాంటి వడ్డీ లేకుండానే జీరో డౌన్ పేమెంట్(Zero Down Payment) ద్వారా మొబైల్ కొనుగోలు చేసే అవకాశం, బ్రాండెడ్ యాక్సెస్‌సిరీస్‌పై 80 శాతంవరకు తగ్గింపును ఇస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రతి ఒప్పో ఫోన్(Oppo phone) కొనుగోలుపై లక్కీ డ్రా(Lucky draw) ద్వారా రూ.10 లక్షల వరకు నగదు గెలుచుకునే అవకాశం కూడా కలిపిస్తునట్లు పేర్కొన్నారు.