JSW స్టీల్‌తో కలిసి దేశంలో రూ.5,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జపాన్ కంపెనీ
భారత్‌లో ప్రముఖ స్టీల్ తయారీ కంపెనీ JSW, జాపాన్‌కు చెందిన JFE స్టీల్ కార్పొరేషన్‌తో కలిసి సంయుక్తంగా దేశంలో పెట్టుబడి పెట్టనుంది
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ప్రముఖ స్టీల్ తయారీ కంపెనీ JSW, జాపాన్‌కు చెందిన JFE స్టీల్ కార్పొరేషన్‌తో కలిసి సంయుక్తంగా దేశంలో పెట్టుబడి పెట్టనుంది. ఈ రెండు కంపెనీలు 50:50 ప్రాతిపదికన జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసి, కర్ణాటకలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. ఈ పెట్టుబడి విలువ రూ.5,500 కోట్లు.
ఈ కొత్త ప్రాజెక్టు పేరు ‘JSW JFE ఎలక్ట్రికల్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్’. బళ్లారిలో ఇది ఏర్పాటవుతుంది. దీనిలో ఉత్పత్తి ఆర్థిక సంవత్సరం 2027 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత్‌లో పెరుగుతున్న గ్రెయిన్ ఓరియెంటెడ్ ఎలక్ట్రికల్ స్టీల్ డిమాండ్‌ను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. దీనిలో ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, చిన్న ట్రాన్స్‌ఫార్మర్‌లు ఉంటాయి.
JSW స్టీల్ తన Q3 ఆర్థిక ఫలితాలను జనవరిలో విడుదల చేసింది. బలమైన దేశీయ డిమాండ్ కారణంగా నికర లాభం 2023–2024 డిసెంబర్ త్రైమాసికంలో రూ.2,450 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.474 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది ఐదు రెట్లు పెరిగింది. త్రైమాసిక ఆదాయం కూడా సంవత్సరానికి రూ.39,322 కోట్ల నుంచి రూ.42,134 కోట్లకు పెరిగింది.