JSW Group: కొరియాకు చెందిన కంపెనీతో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఒప్పందం

భారత ఉక్కు(Steel) రంగ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్(JSW Group) కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-29 15:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ఉక్కు(Steel) రంగ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్(JSW Group) కీలక నిర్ణయం తీసుకుంది.ఏడాదికి 50 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తే లక్ష్యంగా ముందడుగులు వేస్తోంది. ఈ మేరకు కొరియా(Korea)కు చెందిన స్టీల్ మేకింగ్ కంపెనీ పోస్కో గ్రూప్(POSCO GROUP)తో జత కట్టింది. ముంబై(Mumbai)లోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ లో జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌(Sajjan Jindal), పోస్కో ఛైర్మన్ చాంగ్ ఇంహ్వా(Chang In-hwa) అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇండియాలోని ఇంటిగ్రేటడ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు, ఎలెక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన బ్యాటరీ మెటీరియల్స్ రంగాల్లో విస్తరణకు ఈ భాగ్యస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని జేఎస్‌డబ్ల్యూ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో భారత్(India)లో స్టీల్ ప్రొడ్యూస్ కెపాసిటీ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యూ కంపెనీకి స్టీల్, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిమెంట్, పెయింట్స్, మొబిలిటీ, డిఫెన్స్, స్పోర్ట్స్ తదితర రంగాల్లో బిజినెస్ లు ఉన్నాయి. ఈ సంస్థకు మన ఇండియాలోనే కాకుండా యూఎస్(US), ఇటలీ(Italy) దేశాల్లో కూడా స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 

Tags:    

Similar News