Jio Star: డిస్నీ+హాట్ స్టార్, జియో సినిమా కొత్త డొమైన్ నవంబర్ 14న ప్రారంభం..!
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అనుబంధ సంస్థ వయాకామ్ 18(Viacom 18), ది వాల్ట్ డిస్నీ(The Walt Disney) కంపెనీకి చెందిన స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Star India Private Limited) విలీన ప్రక్రియ ఈ వారంలోనే పూర్తయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అనుబంధ సంస్థ వయాకామ్ 18(Viacom 18), ది వాల్ట్ డిస్నీ(The Walt Disney) కంపెనీకి చెందిన స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Star India Private Limited) విలీన ప్రక్రియ ఈ వారంలోనే పూర్తయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విలీన ఒప్పందం విలువ దాదాపు రూ. 70,000 కోట్లుగా ఉంటుందని సమాచారం. వయాకామ్ 18, డిస్నీ+హాట్‌స్టార్ విలీనం పూర్తయితే దేశంలోనే అతి పెద్ద మీడియా కంపెనీగా అవతరించనుంది. విలీనం తర్వాత రెండు కంపెనీల సర్వీసులను కలిపి ఒకే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్(streaming platform)గా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు "జియో స్టార్(Jio Star)" అనే పేరుతో ఓ కొత్త వెబ్సైట్ తెరపైకి వచ్చింది. ఆ వెబ్సైట్ లో 'కమింగ్ సూన్(Coming Soon)' అనే సందేశం కనిపిస్తోంది. నవంబర్ 14 నుంచి ఈ డొమైన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రెండు సంస్థల విలీనం తర్వాత ఐపీఎల్ లాంటి లైవ్ మ్యాచ్ ప్రసారాలు హాట్‌స్టార్‌లోనే వీక్షించాల్సి ఉంటుందని సమాచారం.