వేగవంతమైన 5G నెట్‌వర్క్‌ కోసం భారీగా టవర్లను ఇన్‌స్టాల్ చేసిన జియో

దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో అత్యంత వేగవంతమైన 5G టెలికాం నెట్‌వర్క్‌ను అందించడానికి దాదాపు ఒక లక్ష టెలికాం టవర్‌లను ఇన్‌స్టాల్ చేసింది

Update: 2023-03-25 08:26 GMT

ముంబై: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో అత్యంత వేగవంతమైన 5G టెలికాం నెట్‌వర్క్‌ను అందించడానికి దాదాపు ఒక లక్ష టెలికాం టవర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, నివేదిక ప్రకారం ఇది తన ప్రత్యర్థి కంటే 5 రెట్లు ఎక్కువ. అలాగే, నేషనల్ ఈఎంఎఫ్ పోర్టల్ నుండి వచ్చిన రోజువారీ డేటా ప్రకారం, జియోకు 99,897 బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లు ఉండగా, భారతి ఎయిర్‌టెల్ 22,219 బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లను కలిగి ఉంది. నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్ Ookla ఫిబ్రవరి 28 నివేదిక ప్రకారం.. ఎయిర్‌టెల్ నెట్ వేగం 268 Mbpsతో పోలిస్తే, జియో వేగం 506 Mbpsగా నమోదైంది. భారత్ దాదాపు అర బిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులను కలిగి ఉంది. ఇది చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్‌గా నిలిచింది. వేగవంతమైన 5G సేవలను అందించడానికి రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 5G కనెక్టివిటీని వేగంగా విస్తరిస్తున్నాయి.

Tags:    

Similar News