ఐటీసీలో రూ. కోటికి పైగా సంపాదించే ఉద్యోగుల సంఖ్య 350
2022-23లో రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులు 282 మంది ఉండగా, 2023-24 నాటికి ఈ సంఖ్య 350కి చేరింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దిగ్గజ ఎఫ్ఎంసీజీ ఐటీసీ సంస్థలో రూ. కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఉద్యోగులు భారీగా పెరిగారు. అంతకుముందు ఏడాదిలో కంటే ఈసారి 24.11 శాతం(68 మంది) పెరిగారు. 2022-23లో రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులు 282 మంది ఉండగా, 2023-24 నాటికి ఈ సంఖ్య 350కి చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఐటీసీ ఛైర్మన్, కంపెనీ మ్ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల నికర వేతనం 45 శాతం నుంచి 96 శాతానికి పెరిగింది. ఐటీసీ ఛైర్మన్, ఎండీ సంజీవ్ పూరి వేతనం 49.6 శాతం పెరిగింది. అంతకుముందు ఏడాదిలో పనితీరుపై బోనస్‌తో పాటు ప్రోత్సాహకాలు, కమీషన్ కలుపుకుని రూ. 19.12 కోట్లు అందుకోగా, 2023-24లో ఆయన రూ. 28.62 కోట్ల వేతనం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో ఒకరైన బి సుమంత్ రెమ్యూనరేషన్ 85 శాతం పెరిగి రూ. 52.4 శాతం వృద్ధితో రూ. 13.6 కోటను, సుప్రతిమ్ దత్తా జీతం 59 శాతం, హేమంత్ మాలిక్ వేతనం 30 శాతం పెరిగింది. సుమంత్ కంపెనీకి చెందిన పేపర్‌బోర్డులు, పేపర్, ప్యాకేజింగ్, పర్సనల్ కేర్, విద్య, స్టేషనరీ ఉత్పత్తుల విభాగం, పంపిణీ విభాగాలకు హెడ్‌గా ఉన్నారు. సుప్రతిమ్ దత్తా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా, హేమంత్ మాలిక్ ఫుడ్స్ బిజినెస్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. సంస్థలో 24,567 మంది ఉద్యోగులున్నారు. వారికి సగటున 10 శాతం ఉద్యోగుల వేతనాలను పెంచింది.