IPO: స్టాక్ మార్కెట్లో వచ్చే వారం మూడు ఐపీఓల సందడి.. మరో నాలుగు లిస్టింగ్..!

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గత కొంత కాలంగా ఎక్కువ శతం నష్టాల్లో కొనసాగుతున్న కూడా పబ్లిక్ ఇష్యూలోకి వచ్చేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

Update: 2024-11-10 11:19 GMT

దిశ,వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గత కొంత కాలంగా ఎక్కువ శతం నష్టాల్లో కొనసాగుతున్న కూడా పబ్లిక్ ఇష్యూలోకి వచ్చేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. కాగా నవంబర్ రెండో వారంలో కొత్తగా మూడు కంపనీలు స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీకి రెడీ అయ్యాయి. వీటిలో జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్(Jinka Logistics Solutions)తో పాటు ఓనిక్స్ బయోటెక్(Onyx Biotech), మంగళ్ కంఫ్యూషన్(Mangal Confusion) ఐపీఓలు(IPO) ఉన్నాయి. ఈ మూడు సంస్థలు కలిపి రూ. 1,173.3 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటి సబ్ స్క్రిప్షన్ వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. అలాగే నాలుగు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అవ్వనున్నాయి. ఇందులో స్విగ్గీ, నివ బూప హెల్త్ ఇన్సూరెన్స్, సగిలిటీ ఇండియా, సోలార్ హోల్డింగ్స్ కంపెనీలు ఉన్నాయి.

జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ఐపీఓ..

ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ సర్వీసెస్ అందించే ప్రముఖ సంస్థ జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ఐపీఓ ద్వారా రూ. 1,115 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌(Subscription) నవంబర్ నవంబర్ 13 నుంచి 18 వరకు కొనసాగనుంది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ. 259- రూ. 273గా కంపెనీ ఖరారు చేసింది. ఇందులో షేర్ల విక్రయం ద్వారా రూ. 550 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 564.72 కోట్లను సమీకరించనున్నారు. వచ్చే వారంలో రాబోతున్న మెయిన్ బోర్డు కంపెనీల్లో ఈ సంస్థ ఐపీఓ ఒకటి.

ఓనిక్స్ బయోటెక్ ఐపీఓ..

బయోఫార్మస్యూటికల్ కంపెనీ ఓనిక్స్ బయోటెక్ ఐపీఓ ద్వారా రూ. 29.34 కోట్ల నిధుల్ని సమీకరించనుంది. నవంబర్ 13న సబ్ స్క్రిప్షన్ ప్రారంభమై 15న ముగుస్తుంది. ఒక్కో షేరుకు రూ. 58-61గా నిర్ణయించింది.

మంగళ్ కంఫ్యూషన్ ఐపీఓ..

మంగళ్ కంఫ్యూషన్ ఐపీఓ నవంబర్ 12 నుంచి 14 వరకు అందుబాటులో ఉంటుంది. ఐపీఓ ద్వారా రూ.16.23 కోట్లను సమీకరించనుంది. షేర్ల ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Tags:    

Similar News