మహిళల కోసం 'ఫిమేల్-ఫ్రెండ్లీ' ఫీచర్ తీసుకొచ్చిన ఇండిగో

ఈ ఫీచర్ ద్వారా మహిళల వెబ్ చెక్-ఇన్ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్ చేసుకున్న సీట్లు ఎవరనేది తెలుసుకోవచ్చు

Update: 2024-05-29 10:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మహిళల కోసమనే ప్రత్యేక ఫీచర్‌ ప్రారంభించింది. సాధారణంగా మహిళా ప్రయాణీకుల భద్రత, సౌకర్యం కోసం బస్సుల్లో ఏ సీట్లో మహిళలు బుక్ చేసుకున్నారో తెలిసే సదుపాయం ఉంటుంది. అలాంటి సదుపాయమే విమానంలో కూడా ఎక్కడెక్కడ సీట్లు మహిళలు బుకింగ్ చేసుకున్నారో తెలుస్తుందని ఇండిగో వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా మహిళల వెబ్ చెక్-ఇన్ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్ చేసుకున్న సీట్లు ఎవరనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫీచర్ వెబ్ చెక్-ఇన్ సమయంలో మాత్రమే చూడవచ్చు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు, ఫ్యామిలీ బుకింగ్‌కు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పైలట్ పద్దతిలో అనుమతిచ్చామని, మహిళలకు భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఇండిగో పేర్కొంది. ఇదే సమయంలో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల కోసం ఇండిగో ప్రత్యేక 'సూపర్ సేవర్ సేల్' ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద టికెట్ ధరలు రూ. 1,199 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ సేల్ మే 29 నుంచి మే 31వ తేదీ మధ్య ఉంటుంది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణం చేసేందుకు బుకింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వినియోగదారులు కావాలనుకునే సీట్లకు విధించే ఛార్జీలపై 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు పేర్కొంది. 


Similar News