మార్చిలో మూడు నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు: సీఎంఐఈ!

గతేడాది నుంచి వివిధ కంపెనీలు భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఆ ధోరణి ఈ ఏడాదిలోనూ..... India's unemployment rate hits three-month high as layoffs escalate, latest CMIE data reveals

Update: 2023-04-02 11:27 GMT

న్యూఢిల్లీ: గతేడాది నుంచి వివిధ కంపెనీలు భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఆ ధోరణి ఈ ఏడాదిలోనూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2023, మార్చిలో దేశంలో నిరుద్యోగ రేటు మూడు నెలల గరిష్ఠానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. అందులో భారత ఉద్యోగులు కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ఉద్యోగాలను కోల్పోగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎంఐఈ తాజా గణాంకాల ప్రకారం, 2022, డిసెంబర్‌లో నిరుద్యోగం రేటు 8.30 శాతం ఉంది. ఆ తర్వాత 2023, జనవరిలో 7.14 శాతానికి తగ్గినప్పటికీ మళ్లీ మార్చిలో 7.8 శాతానికి పెరిగిందని సీఎంఐఈ వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లో నిరుద్యోగం అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలిపాయి. మార్చి నెలలో గ్లోబల్ పరిణామాల కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రకటించాయని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ చెప్పారు. అత్యధిక నిరుద్యోగ రేటులో 26.8 శాతంతో హర్యానా మొదటిస్థానంలో ఉందని వ్యాస్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News