భారీ లాభాలు నమోదు చేసిన దేశీయ టైర్ల తయారీ కంపెనీలు!

ప్రస్తుత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయ టైర్ల తయారీ సంస్థలు మెరుగైన లాభాలను సాధించాయి.

Update: 2023-05-09 16:30 GMT
భారీ లాభాలు నమోదు చేసిన దేశీయ టైర్ల తయారీ కంపెనీలు!
  • whatsapp icon

ముంబై: ప్రస్తుత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయ టైర్ల తయారీ సంస్థలు మెరుగైన లాభాలను సాధించాయి. తక్కువ రబ్బరు ఖర్చులు, భారత వాహన మార్కెట్లో అమ్మకాలు ఊపందుకోవడం వంటి అంశాలు కలిసొచ్చాయని కంపెనీలు తెలిపాయి. అంతేకాకుండా కంపెనీ మార్జిన్‌లను పెంచుకునేందుకు ఉత్పత్తుల ధరలు పెంచడం కూడా గణనీయమైన లాభాల వృద్ధికి కారణమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

సమీక్షించిన మార్చి త్రైమాసికంలో అపోలో టైర్స్ లాభాలు 4 రెట్ల వృద్ధితో రూ. 113 కోట్ల నుంచి రూ. 427 కోట్లకు పెరిగాయి. 2023, మొదటి మూడు నెలల్లో ఎంఆర్ఎఫ్, సియట్ వంటి ఇతర దేశీయ టర్ కంపెనీలకు కూడా లాభాలు తెచ్చిపెట్టాయి. సియట్ టైర్స్ లాభాలు ఐదు రెట్లు పుంజుకోగా, ఎంఆర్ఎఫ్ లాభం రెండింతలు పెరిగింది.

గతేడాది మార్చి త్రైమాసికంతో పోలిస్తే టైర్ల తయారీలో వినియోగించే ముడి పదార్థాల ధరలు దాదాపు 11.2 శాతం తగ్గడంతో ఆదాయం 12 శాతం పెరిగి రూ. 6,247 కోట్లకు చేరుకుందని అపోలో టైర్స్ మంగళవారం త్రైమాసిక ఫలితాల సందర్భంగా వెల్లడించింది. సమీక్షించిన కాలంలో కంపెనీ ఖర్చులు 5.6 శాతం పెరిగాయి. ఇక, అపోలో టైర్స్ ఒక్కో షేర్‌కు రూ. 4 తుది డివిడెండ్‌ను ఇచ్చేందుకు కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.

Tags:    

Similar News