ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచిన Indian Bank!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపుతో వినియోగదారులకు గృహ, వ్యక్తిగత, వాహన రుణాలపై ఈఎంఐ భారం మరింత పెరగనుంది. పెంచిన వడ్డీ రేట్లు శనివారం(సెప్టెంబర్ 3) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు వెల్లడించింది. వివిధ కాలవ్యవధులపై ఎంసీఎల్ఆర్ రేటును 0.10 శాతం పెంచుతున్నట్టు గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ముఖ్యంగా వినియోగదారుల రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల కాలవ్యవధులపై ఎంసీఎల్ఆర్ రేటు 6.95 శాతం నుంచి 7.60 శాతం మధ్య ఉంది. అన్ని కాలవ్యవధులపై బ్యాంకు 0.10 శాతం చొప్పున వడ్డీ రేట్లను సవరించింది. అంతేకాకుండా వివిధ కాలవ్యవధులపై ట్రెజరీ బిల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్(టీబీఎల్ఆర్) రేట్లను 5.55 శాతం నుంచి 6.20 శాతం వరకు సవరించింది.
Also Read : టోకనైజేషన్ అమలుకు సిద్ధమంటున్న ఎస్‌బీఐ!