ఈ ఏడాదికి భారత వృద్ధి 6.5 శాతం: నీతి ఆయోగ్ మాజీ ఛైర్మన్!

గత కొన్నేళ్లుగా దేశంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా భారత ఆర్థికవ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి చెందగలదని నీతి ఆయోగ్ మాజీ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు.

Update: 2023-10-02 12:43 GMT

ముంబై: గత కొన్నేళ్లుగా దేశంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా భారత ఆర్థికవ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి చెందగలదని నీతి ఆయోగ్ మాజీ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. సొమవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, దేశవ్యాప్తంగా యువత ఆకాంక్షాలను నెరవేర్చేందుకు, ఉపాధి సృష్టికి ఈ స్థాయి వృద్ధి అవసరమని, భవిష్యత్తులో భారత్ 8 శాతం వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 2023-24కి భారత జీడీపీ 6.5 శాతం సాధించడమే కాకుండా ఇంకొంతకాలం ఇదే స్థాయి వృద్ధి కొనసాగుతుందని భావిస్తున్నట్టు రాజీవ్ కుమార్ చెప్పారు.

ప్రస్తుతానికి దేశ కరెంట్ అకౌంట్ లోటు సానుకూలంగానే ఉందని, విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా కొనసాగుతుండటం కలిసొచ్చే అంశమని రాజీవ్ వివరించారు. ద్రవ్యోల్బణం లక్ష్యం స్థాయి కంటే దిగువకు దిగొస్తోంది. ప్రభుత్వానికి పన్ను ఆదాయం కూడా గతేడాది కంటే 16 శాతం పెరిగిందన్నారు. కాబట్టి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఇదే స్థాయిలో కొనసాగితే వృద్ధి మెరుగ్గా ఉంటుందని వెల్లడించారు.


Similar News