2047 నాటికి మధ్య ఆదాయ దేశంగా భారత్!

భారత్ 2047 నాటికి మధ్య ఆదాయ దేశంగా మారనుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్రాయ్ సోమవారం ప్రకటనలో తెలిపారు.

Update: 2023-04-24 16:04 GMT

న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి మధ్య ఆదాయ దేశంగా మారనుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్రాయ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జీడీపీ - కొనుగోలు శక్తి (పీపీపీ - పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ) ప్రకారం భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అధిక ఆదాయ విభాగంలో ఉన్నాయని, దేశం కూడా ఆ స్థాయికి వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల భారత ఆర్థిక వృద్ధి రేటు ఎగుమతుల ద్వారా మాత్రమే నడపబడుతుందనే చర్చ ఎక్కువగా జరుగుతోందని, అయితే భారత వృద్ధికి స్థానికంగానే అనేక వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం, తలసరి వార్షిక ఆదాయం 12 వేల డాలర్ల(మన కరెన్సీలో సుమారు రూ. 9.83 లక్షలు) కంటే ఎక్కువ ఉన్న దేశం అధిక ఆదాయ దేశంగా పరిగణించబడుతుంది. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న భారత్ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది.

 Also Read..

రతన్ టాటాకు అరుదైన పురస్కారం! 

Tags:    

Similar News