ముడి చమురు ఎగుమతి కోసం UAE కంపెనీకి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం

దేశీయంగా మంగుళూరులో నిల్వ చేసిన ముడి చమురును ఐఓసి ద్వారా కాకుండా తన సౌలభ్యం మేరకు ఎగుమతి చేసుకోడానికి ప్రభుత్వం అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్)కి అనుమతులు ఇచ్చింది.

Update: 2024-03-23 13:11 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మంగుళూరులో నిల్వ చేసిన ముడి చమురును ఐఓసి ద్వారా కాకుండా తన సౌలభ్యం మేరకు ఎగుమతి చేసుకోడానికి ప్రభుత్వం అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్)కి అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ఉత్పత్తికి ముడిసరుకు అయిన చమురును ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ద్వారా మాత్రమే ఎగుమతి చేయాలి. ఈ విషయంలో అడ్నాక్‌కు మినహాయింపు ఇచ్చారు.

ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్ తన అవసరాలలో 85 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటుంది. అయితే దీనిలో కొంత మేరకు చమురును ముందు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో దానిని ఉపయోగిస్తుంది. దేశంలో ప్రస్తుతం 5.33 మిలియన్ టన్నుల చమురును నిల్వ చేయడానికి మూడు చోట్ల ప్రత్యేక ప్లాంట్లు ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (1.33 మిలియన్ టన్నులు), మంగళూరు (1.5 మిలియన్ టన్నులు), కర్ణాటకలోని పాదూరు (2.5 మిలియన్ టన్నులు). ఈ నిల్వలు 9 రోజుల వరకు దేశీయ డిమాండ్‌ను తీర్చగలవు. అయితే మంగళూరు ప్లాంట్‌లోని 1.5 మిలియన్ టన్నుల కెపాసిటీలో సగభాగాన్ని అడ్నాక్‌కి లీజుకు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా దీని ఎగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


Similar News