పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
అందరూ ఊహించినట్లుగానే ఆగస్టు 1వ తేదీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.
దిశ, వెబ్ డెస్క్: అందరూ ఊహించినట్లుగానే ఆగస్టు 1వ తేదీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. అయితే ఈ సారి కేవలం 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రమే రూ. 7.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాగా పెరిగిన ఈ గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. ఈ రోజు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1653.50 చేరుకుంది. అలాగే హైదరాబాద్ నగరంలో రూ. 1896 గా నమోదైంది. ఇదిలా ఉంటే దేశ ప్రజలు అత్యధికంగా ఉపయోగించే 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలపై ఎలాంటి మార్పూ చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్‌ను ప్రభుత్వం రూ.500 వందలకే అందిస్తుంది.