మే నెలలో రూ.1.73 లక్షల కోట్లకు GST వసూళ్లు

భారతదేశ వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మే 2024లో సంవత్సరానికి 10 శాతం పెరిగి రూ. 1.73 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 1న విడుదల చేసిన డేటా పేర్కొంది.

Update: 2024-06-01 14:32 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మే 2024లో సంవత్సరానికి 10 శాతం పెరిగి రూ. 1.73 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 1న విడుదల చేసిన డేటా పేర్కొంది. దేశీయ లావాదేవీల్లో పెరుగుదల 15.3 శాతంగా ఉండటం, దిగుమతులు 4.3 శాతం తగ్గుదల కారణంగా ఈ వృద్ధి కనబడిందని మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. రీఫండ్‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, మే నెలలో నికర జీఎస్‌టీ ఆదాయం రూ. 1.44 లక్షల కోట్లు కాగా, ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 7 శాతం వృద్ధి. అంతకుముందు నెల (ఏప్రిల్)లో జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించడం గమనార్హం. ఎఫ్‌వై25లో మే 2024 వరకు స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ. 3.83 లక్షల కోట్లు. మే 2024 మొత్తం వసూళ్లలో, ప్రభుత్వానికి సెంట్రల్ జీఎస్‌టీ ద్వారా రూ. 32,409 కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీ ద్వారా రూ. 40,265 కోట్లు, దిగుమతి చేసుకున్న వస్తువులపై రూ. 39,879 కోట్లతో సహా రూ.87,781 కోట్ల సమీకృత జీఎస్‌టీ వచ్చింది.


Similar News