ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు రూ. 270 కోట్ల జీఎస్టీ నోటీసులు
ప్రముఖ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రూ లైఫ్ పెద్ద మొత్తంలో జీఎస్టీ నోటీసులు అందుకుంది...
న్యూఢిల్లీ: ప్రముఖ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రూ లైఫ్ పెద్ద మొత్తంలో జీఎస్టీ నోటీసులు అందుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తక్కువ జీఎస్టీ చెల్లించిన కారణంగా పన్ను అధికారులు రూ. 270 కోట్లను డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ బుధవారం వెల్లడించింది. మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) అథారిటీ 2017-18కి వర్తించే వడ్డీ, జరిమానాతో కలిపి కట్టాలని తెలిపింది. చెల్లించాల్సిన మొత్తం రూ. 269.86 కోట్లలో రూ. 119.56 కోట్లు జీఎస్టీ, రూ. 138 కోట్ల వడ్డీ, రూ. 11.95 కోట్ల పెనాల్టీ ఉన్నాయని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి నిర్దేశించిన గడువులోగా అప్పీల్‌ను దాఖలు చేయనున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తన బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.