హ్యూండాయ్ ఇండియా నుంచి కొత్త కాంపాక్ట్ 'క్రెటా' ఫేస్‌లిఫ్ట్ విడుదల
ఆకర్షణీయమైన ఫీచర్లు, అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో కొత్త క్రెటాను హ్యూందాయ్ మోటార్స్ ఇండియా లాంచ్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ కార్ల తయారీ దిగ్గజం హ్యూండాయ్ ఇండియా తన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'క్రెటా' మోడల్‌ను విడుదల చేసింది. రూ. 10,99,900 ప్రారంభ ధరతో ఈ కారును ఏడు వేరియంట్లలో కంపెనీ తీసుకొచ్చింది. టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 19,99,000 వరకు ఉంది. ఆకర్షణీయమైన, అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో కొత్త క్రెటాను హ్యూండాయ్ మోటార్స్ ఇండియా లాంచ్ చేసింది. కొత్త మూడు ఇంజిన్ ఆప్షన్లతో పాటు 6-స్పీడ్ మాన్యూవల్, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో సహా నాలుగు ట్రాన్స్‌మిషన్‌లలో ఈ కారు అందుబాటులో ఉంది. అప్‌డేట్ చేసిన ఫేస్‌లిఫ్టెడ్ క్రెటా బోల్డ్‌గా, ఏడీఏఎస్ వంటి కొత్త సాంకేతికత కలిగి ఉంది. కనెక్టెడ్ లైటింగ్ సెటప్, ముందు, వెనుక వైపున రీడిజైన్ చేశారు. రీడిజైన్ చేసిన గ్రిల్‌తో పాటు ఫ్రంట్ ఎండ్, హుడ్ అంతటా పొడవైన ఎల్ఈడీ డీఆర్ఎల్ స్ట్రిప్, కొత్త సెట్ ఎల్ఈడీ హెడ్‌లైట్లను రీడిజైన్ చేశారు. వేరియంట్‌ని బట్టి కారు లీటర్‌కు 17.4 కిలోమీటర్ల నుంచి 18.4 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.కొత్త 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో అప్‌డేటెడ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయెల్ల్-జోన్ ఏసీ సిస్టమ్ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను కలిగి ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, చైల్డ్ సీట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ నియంత్రణ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.