సరికొత్త ఎస్‌యూవీని విడుదల చేసిన Hyundai!

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ భారత మార్కెట్లో తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'వెన్యూ ఎన్ లైన్ ' మోడల్‌ను విడుదల చేసింది..Latest Telugu News

Update: 2022-09-06 15:25 GMT

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ భారత మార్కెట్లో తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'వెన్యూ ఎన్ లైన్ ' మోడల్‌ను విడుదల చేసింది. దీని ధరలు రూ. 12.16 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే హ్యూండాయ్ వెన్యూ ఎన్‌లైట్ రెండు వేరియంట్లలో లభిస్తుండగా, ఇందులో ఎన్ 6 ధర రూ. 12.16 లక్షలు, ఎన్ 8 రూ. 13.15 లక్షల ధరలో అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

ఇప్పటికే ఈ కొత్త వెర్షన్ వెన్యూ కారు కోసం కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. కంపెనీ డీలర్‌షిప్‌ల వద్ద రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికె ఎన్ లైన్ సిరీస్‌లో హ్యూండాయ్ ఐ20 మోడల్‌ను తెచ్చిన కంపెనీ, ఇందులో మాదిరిగానే స్పోర్టీ స్టీరింగ్, మెరుగైన సస్పెన్షన్, డిస్క్ బ్రేక్, మెరుగైన డ్రైవింగ్ భద్రతాపరమైన ఫీచర్లు లభించనున్నాయి.

వాహనదారుల రక్షణకు సంబంధించి ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ అసిస్ట్ కంట్రోల్ సహా అనేక ఫీచర్లు అందించామని హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ తెలిపారు.

ప్రత్యేక సిరీస్‌లో తెచ్చిన ఈ కారు స్టాండర్డ్ మోడల్ కంటే ఆకర్షణీయమైన డిజైన్‌తో అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ వాహన మార్కెట్లో ఉన్న కుయా సొనెట్ ఎక్స్‌లైన్, టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్, నెక్సాన్ కజిరంగా ఎడిషన్‌లకు హ్యూండాయ్ వెన్యూ ఎన్ లైన్ మోడల్ పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 

Also Read: ఐఫోన్‌ల తయారీ మార్కెట్‌గా భారత్

Tags:    

Similar News