అదానీ నివేదికను విడుదలకు ముందే క్లయింట్‌కు ఇచ్చిన హిండెన్‌బర్గ్: సెబీ

అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అందరికంటే ముందే తమ క్లయింట్లకు ఇచ్చిందని పేర్కొంది.

Update: 2024-07-07 17:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ వివాదం నేపథ్యంలో తాజా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్ అవకతవకలకు, అక్రమాలకు పాల్పడిందంటూ నివేదిక విడుదల చేసిన అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అందరికంటే ముందే తమ క్లయింట్లకు ఇచ్చిందని పేర్కొంది. నివేదికను వెలువరించడానికి రెండు నెలల ముందు న్యూయార్క్‌కు చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ మార్క్ కింగ్‌డన్‌తో ముందుగా ఒక కాపీని అందజేసిందని, విడుదల తర్వాత సదరు క్లయింట్లు షార్ట్ పొజిషన్‌ల ద్వారా వచ్చిన లాభాల్లో వాటా తీసుకున్నట్టు స్పష్టం చేసింది. మార్క్ కింగ్‌డన్‌ ఫండ్ మేనేజర్‌తో హిండెన్‌బర్గ్ 2023, జనవరిలో నివేదిక విడుదలకు ముందే నివేదికను పంచుకుంది. నివేదిక ఆధారంగా అదానీ కంపెనీల షేర్లలో మార్క్ కింగ్‌డన్‌ పొజిషన్ తీసుకుంది. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల అయిన తర్వాత షేర్ల విలువ పతనం కావడం, ఆ తర్వాత పొజిషన్‌ను వదులుకోవడం ద్వారా మార్క్ కింగ్‌డన్ లాభపడింది. లాభాల్లో 30 శాతం వాటా కోసం హిండెన్‌బర్గ్ ఒప్పందం చేసుకుందని సెబీ ఆరోపణలు చేసింది. 


Similar News