VRS ను తీసుకొచ్చిన హీరో మోటోకార్ప్!

దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ప్రారంభించినట్టు బుధవారం ప్రకటించింది

Update: 2023-04-05 15:25 GMT

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ప్రారంభించినట్టు బుధవారం ప్రకటించింది. ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత వాహన మార్కెట్లో మరిన్ని లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మరింత సమర్థవంతంగా, భవిష్యత్తు టెక్నాలజీ కోసం సిద్ధమవ్వాలనే ఉద్దేశ్యంతో వీఆర్ఎస్ తీసుకొచ్చామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ వీఆర్ఎస్ పథకం ద్వారా ఉద్యోగులకు ఒకేసారి పదవీ విరమణ మొత్తాన్ని అందజేయడంతో పాటు, వేరియబుల్ పే, బహుమతులు, హెల్త్ కవరేజ్, పునరావాస సాయం, భవిష్యత్తులో వేరే ఉద్యోగాలను పొందేందుకు అవసరమైన సహకారం సహా ఇతర ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ వివరించింది. కాగా, హీరో మోటోకార్ప్ ఇదివరకు 2019లో తన ఉద్యోగులకు వీఆర్ఎస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News