రూ.1.72 లక్షల ప్రారంభ ధరతో ‘కరిజ్మా XMR 210’
Hero మోటోకార్ప్ కరిజ్మా XMR 210 బైక్‌ను తిరిగి ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: Hero మోటోకార్ప్ కరిజ్మా XMR 210 బైక్‌ను తిరిగి ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైకును ఆగస్టు 29న దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. పాత దానితో పోలిస్తే కొత్త మోడల్లో కొత్త ఫీచర్లను అందించారు. దీని ప్రారంభ ధర రూ.1.72 లక్షలు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ హృతిక్ రోషన్ సరికొత్త హీరో కరిజ్మా XMR 210ని ఆవిష్కరించారు. ఇది ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్, మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ కలర్స్‌లలో లభిస్తుంది. గతంలో 2003లో కంపెనీ కరిజ్మాను లాంచ్ చేసింది. ఇప్పుడు కొత్త ఫీచర్లతో మళ్లీ తీసుకొచ్చారు.
ఈ బైక్ 210cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 25 bhp పవర్, 30 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. డ్యూయల్-ఛానల్ ABS, LED హెడ్‌ల్యాంప్, యాంబియంట్ లైట్ సెన్సార్, బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందించారు. ముందువైపు సస్పెన్షన్ పరంగా టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్లను కలిగి ఉంటుంది.