Credit Card Score : క్రెడిట్ కార్డు స్కోర్ పెరగడం వలన లాభమా? లేక నష్టమా?
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్ది క్రెడిట్ కార్డు వినియోగం కూడా క్రమంగా పెరుగుతుంది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్ది క్రెడిట్ కార్డు వినియోగం కూడా క్రమంగా పెరుగుతుంది. పలు బ్యాంకులు వీటిపై భారీ ఆఫర్లు అందిస్తుండటంతో కస్టమర్లు క్రెడిట్ కార్డు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా చేతిలో డబ్బులు లేకున్నా కూడా కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. చేసే ప్రతి ట్రాన్సక్షన్స్‌పై రివార్డులు కూడా లభిస్తాయి. చాలా విధాలుగా ఉపయోగపడే క్రెడిట్ కార్డు ముఖ్యంగా క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడుతుంది. లోన్ పొందడానికి, క్రెడిట్ లిమిట్‌ను పెంచడానికి క్రెడిట్ స్కోర్ పెరగడం చాలా అవసరం. మరి క్రెడిట్ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి? స్కోర్ పెరగడం వలన లాభమా? లేక నష్టమా? అని ఎప్పుడైనా ఆలోచించారా. అయితే మీ కోసమే క్రెడిట్ కార్డు స్కోర్ గురించి పూర్తి వివరాలు..
లాభాలు:
ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు ఈ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. జాబ్ పోయినప్పుడు, ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు మొదలైన సమయాలలో క్రెడిట్ కార్డు ఆదుకుంటుంది. ఇతర అత్యవసర టైంలో లోన్‌లు కూడా పొందవచ్చు. క్రెడిట్ వినియోగంలో అతి ముఖ్యమైనది 'క్రెడిడ్ లిమిట్', 'క్రెడిట్‌స్కోరు'. క్రెడిట్‌స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉపయోగం ఉంటుంది. కార్డు బిల్లు చెల్లింపులు నిర్ణీత గడువులోపు కట్టేవాళ్లకు మంచి క్రెడిట్ హిస్టరీ ఉండటం వలన స్కోర్ పెరిగి బ్యాంకులు ఎక్కువ లోన్‌లను ఆఫర్ చేస్తాయి.
క్రెడిట్ లిమిట్ పరిమితి ఎక్కువగా ఉందని అనవసర లావాదేవీలను చేయకుండా తగ్గించడం ఉత్తమం. ఉదాహరణకు క్రెడిట్ లిమిట్ రూ. లక్ష ఉంటే రూ. 30 వేల వరకు వాడుకోవచ్చు. క్రెడిట్ లిమిట్‌లో 30 శాతం కంటే ఎక్కువ వాడుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. టైం ప్రకారం ఈఎంఐలు, బిల్లులు చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్ బాగా పెరుగుతుంది.
నష్టాలు:
క్రెడిట్ లిమిట్ ఎక్కువ ఉంది కదా అని ఎక్కువ ఖర్చు పెడితే తిరిగి చెల్లించడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. లిమిట్ పరిమితి కంటే తక్కువ వాడటం మంచిది. వాడుకున్న మొత్తాన్ని చెల్లించకపోతే కంపెనీలు భారీగా వడ్డీని విధిస్తాయి. ఈఎంఐల చెల్లింపులలో ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. దీని కారణంగా క్రెడిట్‌స్కోర్ తగ్గే ప్రమాదం ఉంటుంది.
స్కోర్ తగ్గడం వలన, ఏదైనా ఎమర్జెన్సీ టైం లో రుణాలు పొందడం చాలా కష్టం అవుతుంది. కొనుగోళ్లు చేసినప్పుడు సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. లావాదేవీలకు సంబంధించిన OTP విషయంలో జాగ్రత్త వహించడం ఉత్తమం.
మొత్తంగా చూస్తే క్రెడిట్ కార్డు స్కోర్ పెరడగం వలన లాభాలు ఉన్నాయి. కానీ అది కూడా దాని కార్డు వాడకం పై ఆధారపడుతుంది. లిమిట్ పరిధిలోపు వినియోగిస్తూ, క్రమంగా నిర్ణీత సమయం లోపల బిల్లు చెల్లింపులు చేసినట్లయితే స్కోర్ పెరిగి ఎక్కువగా లాభాలు ఉంటాయి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు, నియంత్రణ లేకుండా వాడినట్లయితే క్రెడిట్ కార్డు స్కోర్ తగ్గుతుంది.
బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్: వడ్డీ రేట్లను పెంచిన కోటక్ బ్యాంక్