HDFC Q2 Results: రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. లాభం రూ.16,821 కోట్లు.. ఐదు శాతం వృద్ధి..!

దేశంలోని ప్రముఖ కంపెనీలు గత కొన్ని రోజులుగా త్రైమాసిక ఫలితాల(Quarterly Results)ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-19 13:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రముఖ కంపెనీలు గత కొన్ని రోజులుగా త్రైమాసిక ఫలితాల(Quarterly Results)ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ప్రముఖ టెక్ కంపెనీ టెక్ మహీంద్రా(Tech Mahindra) తమ క్వార్టర్ రిజల్ట్స్ ను ప్రకటించగా తాజాగా అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) కూడా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్(July-September Quarter Results) త్రైమాసికంలో ఆ సంస్ధ నికర లాభాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(Q2FY25)లో సంస్థ లాభం 5 శాతం మేర పెరిగి రూ.16,821 కోట్ల నికర లాభాన్ని(Net profit) నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.15,976 కోట్లుగా ఉంది. ఇక బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 78,406 కోట్ల నుంచి రూ. 85,500 కోట్లకు పెరిగినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో తెలిపింది. వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధి చెంది రూ. 67,698 కోట్ల నుంచి రూ. 70,017 కోట్లకు చేరుకుందని వెల్లడించింది. బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 1.34 శాతం నుంచి 1.36 శాతానికి పెరగ్గా.. నికర మొండి బకాయిలు 0.35 శాతం నుంచి 0.41 శాతానికి చేరినట్లు తెలిపింది.


Similar News