Vedanta: ఒడిశాలో వేదాంత భారీ పెట్టుబడులు.. రెండు లక్షల మందికి జాబ్స్..!

ప్రముఖ మైనింగ్ కంపెనీ(Mining Company) వేదాంత(Vedanta) దేశంలో రాబోయే రోజుల్లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది.

Update: 2024-10-19 12:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మైనింగ్ కంపెనీ(Mining Company) వేదాంత(Vedanta) దేశంలో రాబోయే రోజుల్లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. ఒడిశా(Odisha)లో 6 మిలియన్‌ టన్నుల అల్యూమినా రిఫైనరీ(Alumina Refinery), 3 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ అల్యూమినియం(Green Aluminum) ప్లాంట్లను స్థాపించనుంది. ఈ మేరకు వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్(Vedanta Chairman Anil Agarwal) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త పెట్టుబడుల ద్వారా దాదాపు  2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు(Employment opportunities) లభిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఒడిశాలో లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టామని, ఇవి అదనమని ఆయన వెల్లడించారు. ఈ పెట్టుబడులతో 2030 నాటికీ ఒడిశా 500 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఒడిశా ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్లే స్కూళ్ళు, స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్స్ నెలకొల్పుతామన్నారు. అయితే త్వరలోనే ఈ పెట్టుబడుల గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.   


Similar News