HDFC Bank: ఎంసీఎల్ఆర్ రేటు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ఎంపిక చేసిన కాలవ్యవధులపై ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-07 14:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్) పెంచుతున్నట్టు సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ఎంపిక చేసిన కాలవ్యవధులపై ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని, దానివల్ల బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేటు 9.10 శాతం నుంచి 9.50 శాతానికి చేరుకుందని అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాంకు పేర్కొంది. బ్యాంకు ప్రధానంగా ఆరు నెలలతో పాటు మూడేళ్ల కాలవ్యవధులపై ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచింది. దాంతో ఆరు నెలల కాలవ్యవధికి సంబంధించి ఎంసీఎల్ఆర్ 9.45 శాతంగానూ, మూడేళ్ల కాలానికి 9.50 శాతంగానూ ఉంది. ఎంసీఎల్ఆర్ అనేది కనీస వడ్డీ రేటు. నిధులు సేకరించేందుకు బ్యాంకుల‌కు అయ్యే ఖర్చులు, నిర్వహ‌ణ వ్యయం, క్యాష్ రిజ‌ర్వు రేషియో (సీఆర్ఆర్‌), కాల‌ప‌రిమితి, ప్రీమియంల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని దీన్ని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే త‌క్కువ‌కు రుణాలు ఇవ్వదు. కాల‌ప‌రిమితుల‌ను బట్టి ఎంసీఎల్ఆర్ వేర్వేరుగా ఉంటుంది. బ్యాంకు అందించే రుణాలు ఏడాది, పర్సనల్ లోన్స్ రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానంగా ఉంటుంది. 

Tags:    

Similar News