Windfall Tax: మరోసారి విండ్‌ఫాల్ పన్నును రద్దు చేసిన కేంద్రం
2022, జూలై 19లో విండ్‌ఫాల్ పన్ను విధించినప్పటి నుంచి సున్నాకు తగ్గించడం ఇది రెండోసారి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుతం నిర్ణయం తీసుకుంది. ఇది సెప్టెంబర్ 18 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2022, జూలై 19లో విండ్‌ఫాల్ పన్ను విధించినప్పటి నుంచి సున్నాకు తగ్గించడం ఇది రెండోసారి. చివరిసారి 2023, ఏప్రిల్ 4న కేంద్రం విండ్‌ఫాల్ పన్నును సున్నాకి తగ్గించింది. ఇదివరకు ఆగష్టు 31న దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు రూ. 2,100 నుంచి రూ. 1,850కి తగ్గింది. అంతకుముందు ఆగష్టు 17న సైతం పెట్రోలియం ఉత్పత్తులపై విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ని సవరిస్తూ ముడిచమురుపై టన్నుకు రూ.2,400 నుంచి రూ.2,100కి తగ్గించింది. కాగా, గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు ఏప్రిల్‌లో బ్యారెల్‌కు 92 డాలర్ నుంచి 75 డాలర్‌కు తగ్గాయి. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు, చమురు ఎగుమతులపై 2022, జులై 1 నుంచి ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్ను తీసుకొచ్చింది. అంతర్జాతీయ ధరల ఆధారంగా 15 రోజులకోసారి పన్నును సవరిస్తోంది. ఎగుమతుల ద్వారా కంపెనీలు అదనపు లాభాలు పొందుతున్న కారణంగా దీన్ని తీసుకొచ్చింది.