ఎలక్ట్రిక్ వెహికల్స్ : ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్
దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్ట్రిక్ వాహన రంగానికి ప్రోత్సాహాన్ని అందించే కీలక ప్రకటనను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్ట్రిక్ వాహన రంగానికి ప్రోత్సాహాన్ని అందించే కీలక ప్రకటనను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేశారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వ్యవస్థలు, ఆ వాహనాల ఛార్జింగ్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తామని ఆమె వెల్లడించారు. పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం (పీఎస్‌ఎం) ద్వారా ప్రజా రవాణా నెట్‌వర్క్‌ల కోసం ఈ-బస్సులను కొనుగోలు చేయడాన్ని, వినియోగించడాన్ని ప్రోత్స హిస్తామన్నారు. దేశంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూనే.. రవాణా కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను పైప్డ్ నేచురల్ గ్యాస్‌ను అందుబాటులోకి తేవడంపై ఫోకస్ చేస్తామని నిర్మల చెప్పారు. బయో డీగ్రేడబుల్ ఇంధనాల ఉత్పత్తికి కోసం బయో మాన్యుఫ్యాక్చరింగ్, బయోఫౌండ్రీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. ‘ఫేమ్’ స్కీంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు ఏటా అందించే రాయితీలను ఆర్థికమంత్రి 44 శాతం మేర తగ్గించారు. ‘ఫేమ్’ స్కీంకు గతేడాది రూ. 4,807 కోట్లను కేటాయించగా.. ఈసారి ఆ మొత్తం రూ. 2,671 కోట్లకు తగ్గింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఇన్‌స్టాలేషన్, నిర్వహణలో నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ఫోకస్ చేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.