Raghuram Rajan: ఉద్యోగాల సృష్టికి శ్రమ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి: రఘురామ్ రాజన్

ప్రభుత్వం శ్రమ-ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని సూచించారు

Update: 2024-09-29 13:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో అవసరమైన మేరకు ఉద్యోగాల కల్పన జరగడంలేదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దేశ జీడీపీ 7 శాతం వృద్ధిని సాధిస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల సంఖ్యను బట్టి ఉద్యోగాల సృష్టి జరగడంలేదన్నారు. దీని పరిష్కారానికి ప్రభుత్వం శ్రమ-ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయిలోని వారే అధిక ఆదాయాన్ని పొందుతునారని, దిగువ స్థాయిలో వినియోగం పెరుగుతున్నప్పటికీ కరోనా మహమ్మారి పూర్వ స్థాయి నుంచి కోలుకోలేకపోతున్నారని రాజన్ వివరించారు. భారీగా ఉపాధి కల్పన జరుగుతోందని అనుకోవచ్చు కానీ, తయారీ రంగంలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి. 7 శాతం వృద్ధి సాధిస్తున్న భారత ఆర్థికవ్యవస్థ తగిన్నని ఉద్యోగ అవకాశాలను అందిస్తోందా అని రాజన్ సందేహం వ్యక్తం చేశారు. ఎక్కువ పెట్టుబడితో కూడిన పరిశ్రమలు వేగంగా పెర్గుతున్నాయి. కానీ శ్రమతో కూడిన పరిశ్రమలు పెరగడంలేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వియత్నాం, బంగ్లాదేశ్‌లను ఉదహరించిన రఘురామ్ రాజన్.. ఆయా దేశాలు టెక్స్‌టైల్స్, లెదర్ వంటి శ్రమ ఆధారిత పరిశ్రమల నుంచి వృద్ధిని సాధిస్తున్నాయి. భారత్ కూడా ఈ విషయంలో అవకాశాలను వదులుకోకూడదని వెల్లడించారు. 

Tags:    

Similar News