Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణకు ప్రభుత్వ ప్యానెల్‌ ఏర్పాటు

ఈడీ, ఆర్‌బీఐ, పన్ను, వినియోగదారు వ్యవహారాల విభాగాలకు చెందిన ప్రతినిధులతో ఒక అంతర్-విభాగ కమిటీని ఏర్పాటు

Update: 2024-09-15 16:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలో ఉన్న సవాళ్లను, నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఈడీ, ఆర్‌బీఐ, పన్ను, వినియోగదారు వ్యవహారాల విభాగాలకు చెందిన ప్రతినిధులతో ఒక అంతర్-విభాగ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్(సీబీఐసీ) తాజా నివేదిక ప్రకారం.. జీఎస్టీ ఇంటిలిజెన్స్ విభాగం ఇటీవల 118 దేశీయ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలపై చర్యలు తీసుకుంది. వాటిలో 34 మందికి రూ. 1,10,532 కోట్ల విలువైన పన్ను నోటీసులను జారీ చేసింది. 28 శాతం జీఎస్టీ చెల్లించని కారణంతో ఆయా గేమింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఇవే కాకుండా మరో 658 ఆఫ్‌షోర్ ఎంటిటీలు నాన్-రిజిస్టర్డ్/కాంప్లైంట్ ఎంటిటీలుగా గుర్తించింది. వాటిని డీజీసీఐ దర్యాప్తు చేస్తోంది. అలాగే, 167 వెబ్‌సైట్లను బ్లాక్ చేయడానికి సిఫార్సు చేసింది. డీజీసీఐ తన వార్షిక నివేదిక 2023-24లో ఆన్‌లైన్ మనీ గేమింగ్ పరిశ్రమ పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్, సైబర్ మోసాలు సహా వివిధ సామాజిక-ఆర్థిక నేరాలతో 'అధిక-రిస్క్'ని కలిగి ఉందని పేర్కొంది. గతేడాది అక్టోబర్ 1 నుంచి చట్టపరమైన స్పష్టత అమల్లోకి వచ్చినప్పటికీ, గేమింగ్ సంస్థలను ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడం క్లిష్టమైన ప్రక్రియగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సవాళ్లను అధిగమించాలని ప్రయత్నిస్తోంది. 

Tags:    

Similar News