వచ్చే మార్చిలో షిప్పింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణకు బిడ్ల ఆహ్వానం!

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ రంగ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌సీఐ) ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం

Update: 2022-08-30 10:18 GMT

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ రంగ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌సీఐ) ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం ఆర్థిక బిడ్లను ఆహ్వానించే అవకాశం ఉందని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపు కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 65 వేల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఎల్ఐసీ ఐపీఓ ద్వారా రూ. 24,400 కోట్లను సేకరించింది. రానున్న డిసెంబర్ త్రైమాసికంలో భారీ ఎర్త్‌మూవింగ్‌ పరికరాలను తయారు చేసే బీఈఎంఎల్‌ వాటాలను విక్రయించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా షిప్పింగ్ కార్పొరేషన్ ప్రవేటీకరణకు బిడ్లను ఆహ్వానించనుంది. జనవరి-మార్చి త్రైమాసికంలో దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే సంస్థ భూములు, నాన్-కోర్ ఆస్తులను ఎస్‌సీఐ ల్యాండ్ అండ్ అసెట్స్ లిమిటెడ్‌కు బదలాయించే ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పడుతుందని, అనంతరం ఎస్‌సీఐ వ్యూహాత్మక విక్రయం మొదలైన తర్వాత ఆర్థిక బిడ్లను ఆహ్వానించనున్నట్టు అధికారి వివరించారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఎస్‌సీఐ నాన్-కోర్ ఆస్తుల విలువ రూ. 2,392 కొట్లుగా ఉన్నాయి.

Tags:    

Similar News